పున్నమి ప్రతినిధి, 19 ఫిబ్రవరి రామచంద్రపురం
తిరుపతి జిల్లా అధ్యక్షులు కంభం లోకనాదం ఆధ్వర్యంలో బీసీ సంఘం బలోపేతం దిశలో భాగంగా తిరుపతి బీసీ కార్యాలయ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చంద్రగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా రామచంద్రాపురం మండలం సొరకాయలపాలెం గ్రామానికి చెందిన చిత్తూరు చిరంజీవిని మరియు రామచంద్ర పురం మండల బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా వేమూరు గురుమూర్తి ని నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శులు మధు మార్గచార్యులు, పి. జ్యోతి, జిల్లా ఐటీ విభాగం , మండల అధ్యక్షుడు కోటి యాదవ్ మరియు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు.


