ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సాధికారిత సంఘం యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన మెంగని మనోహర్‌ను బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ, మనోహర్ విద్యార్థి ఉద్యమ కారుడిగా విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర స్థాయిలో సేవలందించారని పేర్కొన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు రావడం ఆనందకరమని అన్నారు.
మనోహర్ మాట్లాడుతూ, బీసీ యువతను చైతన్యం చేస్తూ వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుద్దాల దేవయ్య, కొమ్మేట రాజు, భూక్య మధు నాయక్, బాలయ్య, పుట్ట చంద్రయ్య, వినయ్, బాబు తదితరులు పాల్గొన్నారు.


