**
*కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధవత్ శివ ప్రసాద్ నాయక్ గారు*
ఆసిఫాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు సేవా లాల్ సేనా జిల్లా అధ్యక్షులు బాధవత్ శివ ప్రసాద్ నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్ ను పూర్తిగా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కోరారు.బీజేపీ, బీఆరెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు


