గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగరావు (KNR) నియమితులయ్యారు. పార్టీ తన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో పని చేసే అవకాశం ఇచ్చిందని KNR ఆనందం వ్యక్తం చేశారు.
“పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తాను” అని KNR తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ జీ, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం తాను సాయశక్తుల కృషి చేస్తానని కర్ణం రెడ్డి నర్సింగరావు వెల్లడించారు.


