ఖమ్మం మార్చి
( పున్నమి జిల్లా ఇంచార్జి )
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఖమ్మం రెండవ పట్టణ కమిటీకి సంబంధించిన శిక్షణ తరగతులు శనివారం ఖమ్మం బైపాస్ రోడ్‌లోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమానికి టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్‌లకు చెందిన పార్టీ బాధ్యులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ విజ్ఞప్తి చేశారు.
పార్టీ బలోపేతం, కార్యాచరణ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



