ఖమ్మం పున్నమి ప్రతి నిధి
👉🏽నాగులవంచ రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు N రామచంద్రరావు గారిని కలిసిన బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలపై రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ని తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బల్లలు, నీటి సదుపాయం, ఫుట్ బాత్ సమస్యలపై వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి రైల్వే వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. అని కొండా గోపి తెలియజేశారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు గారు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్ గారు, అమరనేని విజయ్, ch నాగులు, ధనియాకుల వెంకటనారాయణ,పరుశురాము తదితరులు పాల్గొన్నారు.

