*బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ నియామకం*
న్యూ ఢిల్లీ:
బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు చెందిన సీనియర్ నేత నితిన్ నబిన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నితిన్ నబిన్, బంకిపూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కలిగిన నాయకుడు.
పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రాల మధ్య సమన్వయం, కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతలను నితిన్ నబిన్ సమర్థంగా నిర్వర్తిస్తారని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.


