ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం రూరల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సంబంధిత సమావేశం మండల అధ్యక్షుడు మధు నాయక్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా తెలంగాణ బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ,పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నున్న రవికుమార్ లు హాజరై నారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసు దేవరావ్ మాట్లాడుతూ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగినవని, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు బలమైన కట్టుదిట్టమైన సంఘటనా నిర్మాణం చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, కేంద్రం నుండి రాష్ట్రం వరకు బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజల ప్రయోజనకర పథకాల గురించి వివరిస్తూ, పార్టీ ఆలోచనా ధోరణిని ప్రజలకు చేరవేయాలన్నారు
బిజెపి ఆలోచనా ధోరణి ప్రజల అభివృద్ధి, దేశ భద్రత, యువతకు అవకాశాలు, రైతులకు మేలు, మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలన్నారు
అదేవిధంగా చేయవలసిన కార్యక్రమాలు:
బూత్ కమిటీల బలోపేతం – ప్రతి బూత్‌లో కనీసం 20 మంది క్రియాశీలక కార్యకర్తలతో బలమైన కమిటీ ఏర్పాటు చేయాలి.
జడ్పిటిసి అభ్యర్థులు ప్రతి గ్రామాన్నీ పర్యటించాలి.
ఎంపీటీసీ అభ్యర్థులు తమ పరిధిలోని యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ సంఘాల నాయకులను నేరుగా కలవాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్ నగిరిగంటి వీరభద్రం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ మరియు మండల నాయకులు నలమసు శీను, సోనుపల్లి శీను తదితర నాయకులు పాల్గొన్నారు..


