Friday, 27 March 2026
  • Home  
  • బీజేపీ , ఏం ఆర్ పి ఎస్ ల ఆధ్వర్యంలో లో బంద్ విజయవంతం
- ఖమ్మం

బీజేపీ , ఏం ఆర్ పి ఎస్ ల ఆధ్వర్యంలో లో బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపును భాజపా బలంగా సమర్థించింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారి సూచనలతో, తల్లాడ పట్టణంలో భాజపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి, బీసీల హక్కుల కోసం గళమెత్తారు. బంద్ సందర్భంగా షాపులు, హోటళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయడంతో తల్లాడ పట్టణం పూర్తిగా బంద్‌గా మారింది. ప్రభుత్వం బీసీలను పట్టించుకోని తీరుపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు న్యాయం చేయకుండా పాలన కొనసాగిస్తున్న “కసాయీ ప్రభుత్వం”కు ఈ బంద్ ఒక హెచ్చరికగా మారిందని భాజపా నాయకులు వ్యాఖ్యానించారు. ఈ బంద్ కార్యక్రమంలో భాజపా తల్లాడ మండలాధ్యక్షులు చల్లా నాగులు, నాయకులు ఆపతి వెంకట రామారావు, గాదె కృష్ణారావు, పెరిక కిరణ్, తమ్మిశెట్టి కృష్ణ, చల్లా నరేష్, సంగీతం సాయి చంద్, పులి వెంకటేశ్వర్లు, ఉదయగిరి రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు, దారెల్లి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, బొడ్డు కృష్ణ తదితరులు కూడా పాల్గొని బీసీల న్యాయ సాధనకు ఐక్యంగా నిలిచారు.

పున్నమి ప్రతి నిధి

తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపును భాజపా బలంగా సమర్థించింది.

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారి సూచనలతో, తల్లాడ పట్టణంలో భాజపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి, బీసీల హక్కుల కోసం గళమెత్తారు. బంద్ సందర్భంగా షాపులు, హోటళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయడంతో తల్లాడ పట్టణం పూర్తిగా బంద్‌గా మారింది.

ప్రభుత్వం బీసీలను పట్టించుకోని తీరుపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు న్యాయం చేయకుండా పాలన కొనసాగిస్తున్న “కసాయీ ప్రభుత్వం”కు ఈ బంద్ ఒక హెచ్చరికగా మారిందని భాజపా నాయకులు వ్యాఖ్యానించారు.

ఈ బంద్ కార్యక్రమంలో భాజపా తల్లాడ మండలాధ్యక్షులు చల్లా నాగులు, నాయకులు ఆపతి వెంకట రామారావు, గాదె కృష్ణారావు, పెరిక కిరణ్, తమ్మిశెట్టి కృష్ణ, చల్లా నరేష్, సంగీతం సాయి చంద్, పులి వెంకటేశ్వర్లు, ఉదయగిరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు, దారెల్లి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, బొడ్డు కృష్ణ తదితరులు కూడా పాల్గొని బీసీల న్యాయ సాధనకు ఐక్యంగా నిలిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.