Monday, 23 February 2026
  • Home  
  • బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు, హిందువులపై అకృత్యాలు ఖండిస్తున్నాం: సుదర్శన్ మిశ్రా
- ఖమ్మం

బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు, హిందువులపై అకృత్యాలు ఖండిస్తున్నాం: సుదర్శన్ మిశ్రా

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతుండగా, మరోవైపు హిందువులపై దారుణమైన అకృత్యాలు కొనసాగుతున్నాయని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు సత్తుపల్లి లో బీజేపీ కార్యా లయం లో జరిగిన సమావేశం లో సుదర్శన్ మిశ్రా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్ర రావు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై దాడులను లక్ష్యంగా పెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోందని ఆయన విమర్శించారు. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం బాధాకరమని, కానీ తెలంగాణ రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు గాంధీ కుటుంబానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ అరాచకాలకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుదర్శన్ మిశ్రా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బీమి రెడ్డి బాలకృష్ణ రెడ్డి, నాయుడు రాఘవ, పడిగల మధు, సురేంద్ర సాలి శివ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)

రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతుండగా, మరోవైపు హిందువులపై దారుణమైన అకృత్యాలు కొనసాగుతున్నాయని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు సత్తుపల్లి లో బీజేపీ
కార్యా లయం లో జరిగిన సమావేశం లో సుదర్శన్ మిశ్రా మాట్లాడుతూ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్ర రావు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై దాడులను లక్ష్యంగా పెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోందని ఆయన విమర్శించారు. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం బాధాకరమని, కానీ తెలంగాణ రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు.

గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు గాంధీ కుటుంబానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ అరాచకాలకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ కార్యకర్తలు, నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుదర్శన్ మిశ్రా డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బీమి రెడ్డి బాలకృష్ణ రెడ్డి, నాయుడు రాఘవ, పడిగల మధు, సురేంద్ర సాలి శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.