*బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం*
ప్రాణదాతలుకావాలని మనోజ్ కుమార్ పిలుపు.
కేసరపల్లి, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి సురేష్ )
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ , కృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ సహకారంతో గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పంచాయితీ ఆఫీస్ నందు పిన్నమనేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్త దానం అంటే ప్రాణదానం, ప్రతి ఒక్కరు రక్త దానం చేసి ప్రాణ దాత కావాలని కోరారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మూల్పూరి బాలకృష్ణ , కేసరపల్లి గ్రామా సర్పంచ్ కుమారి చేబ్రోలు లక్ష్మి మౌనిక , కేసరపల్లి గ్రామా నాయకులు బసవరాజు , వీర బాబు , కేసరపల్లి గ్రామా ఉప సర్పంచ్ చిన్ని, పిఆర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ కృష్ణ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషు కుమార్ , గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య , కేసరపల్లి గ్రామ అధ్యక్షులు పలగాని బాల కృష్ణ , నిడదవోలు బీజేవైఎం అధ్యక్షులు మోర్త సాయి కుమార్ ,పిన్నమనేని హాస్పిటల్స్ డాక్టర్ కళ్యాణ్ కృష్ణ , డాక్టర్ జాస్మిన్ , బీజేపీ కార్యకర్తలు , కేసరపల్లి గ్రామా ప్రజలు పాల్గొన్నారు.


