భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు అమలాపురం పట్టణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి ఇరువురు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ స్వదేశీ మంత్రం చరకా యంత్రం దేశ ప్రజలకు నేర్పించి బ్రిటిష్ వాళ్ళని గడగల్లాడించిన ఘనత మహాత్మా గాంధీ ది అని అన్నారు, శాస్త్రి 1964లో జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత, ప్రధానమంత్రి అయ్యారని ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించిన కాలంలో దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొందని, వ్యవసాయ విప్లవాన్ని (Green Revolution) ప్రోత్సహించారన్నారు. 1965 ఇంద్ర–పాకిస్తాన్ యుద్ధ సమయంలో “జై జవాన్, జై కిసాన్” నినాదాన్ని ఇచ్చి దేశాన్ని ఐక్యంగా చేర్చగలిగారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి, నిజాయితీ, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమ విజ్ఞానానికి ప్రతిరూపంగా నిలిచిన ప్రముఖ నేత అనీ, ఆయన 1904 అక్టోబర్ 2 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్సరాయిలో జన్మించారని అన్నారు. అంతేకాకుండా శాస్త్రి మహాత్మా గాంధీ ప్రభావంతో భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని, తొమ్మిది సంవత్సరాలు వరకు జైలు శిక్ష అనుభవించారన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారత దేశ ప్రజలను ఉత్తేజపరిచిన భారతదేశ ముద్దుబిడ్డ లాల్ బహుదూర్ శాస్త్రి అని అన్నారు. అనంతరం ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కొపనాతి దత్తాత్రేయ, సీనియర్ నాయకులు ఇళ్ళ సత్యనారాయణ,సీనియర్ నాయకులు సంసాని రత్నకుమార్, పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి డివిఎస్ రాజు, గొల్లకోటి వెంకటరెడ్డి, రేకాడి వర్మ, సంసు సాద్విక్, పసుపులేటి మహాలక్ష్మిరావు, బొంతు శివాజీ, మోకాఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి, మాకిరెడ్డి మనోజ్, పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు.


