Monday, 8 December 2025
  • Home  
  • బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్రవినోద్ రావు
- ఖమ్మం

బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్రవినోద్ రావు

ఖమ్మం (పున్నమి ప్రతి నిధి ) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాంద్ర వినోద్ రావు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి కి పార్టీ అధిష్ఠానం టికెట్ మంజూరు చేసింది.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క ఓటరుని కలుస్తు ముందు కు సాగుతున్నారు. ఈ సం దర్భముగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో ప్రతి బూత్‌లో, ప్రతి గడప వద్ద విస్తృతంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరైన విధంగా వినియోగించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుందని, కేంద్రం విడుదల చేసిన వందల కోట్ల రూపాయల నిధులను రేవంత్ సర్కార్ వినియోగించకపోవడం విచారకరమని అన్నారు. రేపు 11 న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం సాధించేలా ఆశీర్వదించాలని తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బిజెపిని విశేషంగా ఆదరిస్తుండటం గర్వకారణమని, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఖమ్మం
(పున్నమి ప్రతి నిధి )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాంద్ర వినోద్ రావు.

వివరాల్లోకి వెళ్తే..

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి కి పార్టీ అధిష్ఠానం టికెట్ మంజూరు చేసింది..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క ఓటరుని కలుస్తు ముందు కు సాగుతున్నారు.
ఈ సం దర్భముగా
తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో ప్రతి బూత్‌లో, ప్రతి గడప వద్ద విస్తృతంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరైన విధంగా వినియోగించడంలో విఫలమవుతోందని ఆరోపించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుందని, కేంద్రం విడుదల చేసిన వందల కోట్ల రూపాయల నిధులను రేవంత్ సర్కార్ వినియోగించకపోవడం విచారకరమని అన్నారు.

రేపు 11 న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం సాధించేలా ఆశీర్వదించాలని తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు.

ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బిజెపిని విశేషంగా ఆదరిస్తుండటం గర్వకారణమని, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.