Monday, 30 March 2026
  • Home  
  • బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు .
- విశాఖపట్నం

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు .

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు . • పరిష్కార మార్గం దిశగా ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో కలిసి బీచ్ ప్రాంతంలో పరిశీలన. • వై .ఎం. సి. ఎ . బీచ్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి: విశాఖ నగర సముద్ర తీరంలో పలు కాలువలు ద్వారా వ్యర్ధాలు, మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారానికి జీవీఎంసీ పటిష్ట చర్యలు చేపడుతుందని, ఆ దిశగా అనుభవజ్ఞులైన ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో బీచ్ ప్రాంతంలో పర్యటించి పరిశీలనలు జరిపామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అధికారులతో , ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అనుభవజ్ఞులైన విశ్రాంత ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎస్. బాలా ప్రసాద్ లతో కలిసి బీచ్ లో కలుస్తున్న పలు కాలువలను ఆదివారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముందుగా ఆల్ ఇండియా రేడియో సమీపంలో జగన్నాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న వంతెన కింద కాలువను పరిశీలించిన అనంతరం బీచ్ రోడ్ లో వై ఎం సి ఎ వద్ద ,బీచ్ వైపు ఉన్న కాలువ ప్రాంతాన్ని పరిశీలించి మురుగునీరు బీచ్ లో కలవకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రొఫెసర్లతో కమిషనర్ చర్చించారు. ముందుగా వై.ఎం.సి.ఏ బీచ్ మురుగు నీరు చేరిన ప్రాంతంలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటు చేసినట్లయితే సమస్యకు కొంత పరిష్కారం ఏర్పడుతుందని , అందువలన కలిగే ప్రయోజనం దృష్ట్యా బీచ్ లో కలుస్తున్న మిగిలిన కాలువల వద్ద కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్లు పలు సలహాలను అందించి కమిషనర్ కు సూచించగా .., దానివలన కలిగే ప్రయోజనాలపై కమిషనర్ ప్రొఫెసర్లతో సుదీర్ఘ చర్చ జరిపి అందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కార్యనిర్వాహక ఇంజనీరు ఏడుకొండలకు కమిషనర్ ఆదేశించారు. అనంతరం వై ఎం సి ఎ కాలువ వద్ద స్క్రీన్ లను , మురుగునీరు పారుతున్న ప్రక్రియను పరిశీలించి సంబంధిత సహాయక ఇంజనీర్లు నిత్యం కాలువలను పరిశీలించి, అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ ఏడుకొండలు కు కమిషనర్ ఆదేశించారు. * ” బీచ్ తీరంలో వ్యాపారస్తులు వ్యర్ధాల నిర్వహణపై పరిశుభ్రత పాటించనందుకు జరిమానాన్ని విధించిన కమిషనర్ ” బీచ్ లో వై ఎం సి ఎ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఒక దుకాణం ముందు అధికంగా పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ దుకాణదారుడు వ్యర్ధాలు నిర్వహణపై పరిశుభ్రత పాటించడం లేదని ఐదు వేల రూపాయలను ఆ దుకాణానికి జరిమానాలను విధించి వెంటనే వారిచే చెల్లింప చేశారు. విశాఖ నగరంలో నిత్యం బీచ్ తీర ప్రాంతాలకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు విచ్చలవిడిగా దుకాణాల ముందు వ్యర్ధాలను పడవేస్తూ బీచ్ పరిసర ప్రాంతాలను, ఆహ్లాద వాతావరణాన్ని అపరిశుభ్రపరుస్తున్నారని, అటువంటి వారిపై జరిమానాలను విధించాలని అవసరమైనట్లయితే సంబంధిత షాపులను తొలగించాలని అందుకు జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే బీచ్ తీర ప్రాంతంలో సందర్శకులు ,వ్యాపారస్తులు వ్యర్ధాలను పడవేయకుండా వారికి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలని , బీచ్ తీర ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ కు, జోనల్ కమిషనర్ శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు శాంతిరాజు మురళీకృష్ణ సహాయక వైద్యాధికారులు బి.ప్రసాదరావు, కృష్ణంరాజు, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, వార్డ్ శానిటరీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు .

• పరిష్కార మార్గం దిశగా ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో కలిసి బీచ్ ప్రాంతంలో పరిశీలన.

• వై .ఎం. సి. ఎ . బీచ్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు.

– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి: విశాఖ నగర సముద్ర తీరంలో పలు కాలువలు ద్వారా వ్యర్ధాలు, మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారానికి జీవీఎంసీ పటిష్ట చర్యలు చేపడుతుందని, ఆ దిశగా అనుభవజ్ఞులైన ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో బీచ్ ప్రాంతంలో పర్యటించి పరిశీలనలు జరిపామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అధికారులతో , ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అనుభవజ్ఞులైన విశ్రాంత ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎస్. బాలా ప్రసాద్ లతో కలిసి బీచ్ లో కలుస్తున్న పలు కాలువలను ఆదివారం పరిశీలించారు.

ఈ పరిశీలనలో ముందుగా ఆల్ ఇండియా రేడియో సమీపంలో జగన్నాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న వంతెన కింద కాలువను పరిశీలించిన అనంతరం బీచ్ రోడ్ లో వై ఎం సి ఎ వద్ద ,బీచ్ వైపు ఉన్న కాలువ ప్రాంతాన్ని పరిశీలించి మురుగునీరు బీచ్ లో కలవకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రొఫెసర్లతో కమిషనర్ చర్చించారు. ముందుగా వై.ఎం.సి.ఏ బీచ్ మురుగు నీరు చేరిన ప్రాంతంలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటు చేసినట్లయితే సమస్యకు కొంత పరిష్కారం ఏర్పడుతుందని , అందువలన కలిగే ప్రయోజనం దృష్ట్యా బీచ్ లో కలుస్తున్న మిగిలిన కాలువల వద్ద కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్లు పలు సలహాలను అందించి కమిషనర్ కు సూచించగా .., దానివలన కలిగే ప్రయోజనాలపై కమిషనర్ ప్రొఫెసర్లతో సుదీర్ఘ చర్చ జరిపి అందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కార్యనిర్వాహక ఇంజనీరు ఏడుకొండలకు కమిషనర్ ఆదేశించారు. అనంతరం వై ఎం సి ఎ కాలువ వద్ద స్క్రీన్ లను , మురుగునీరు పారుతున్న ప్రక్రియను పరిశీలించి సంబంధిత సహాయక ఇంజనీర్లు నిత్యం కాలువలను పరిశీలించి, అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ ఏడుకొండలు కు కమిషనర్ ఆదేశించారు.

* ” బీచ్ తీరంలో వ్యాపారస్తులు వ్యర్ధాల నిర్వహణపై పరిశుభ్రత పాటించనందుకు జరిమానాన్ని విధించిన కమిషనర్ ”

బీచ్ లో వై ఎం సి ఎ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఒక దుకాణం ముందు అధికంగా పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ దుకాణదారుడు వ్యర్ధాలు నిర్వహణపై పరిశుభ్రత పాటించడం లేదని ఐదు వేల రూపాయలను ఆ దుకాణానికి జరిమానాలను విధించి వెంటనే వారిచే చెల్లింప చేశారు.
విశాఖ నగరంలో నిత్యం బీచ్ తీర ప్రాంతాలకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు విచ్చలవిడిగా దుకాణాల ముందు వ్యర్ధాలను పడవేస్తూ బీచ్ పరిసర ప్రాంతాలను, ఆహ్లాద వాతావరణాన్ని అపరిశుభ్రపరుస్తున్నారని, అటువంటి వారిపై జరిమానాలను విధించాలని అవసరమైనట్లయితే సంబంధిత షాపులను తొలగించాలని అందుకు జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే బీచ్ తీర ప్రాంతంలో సందర్శకులు ,వ్యాపారస్తులు వ్యర్ధాలను పడవేయకుండా వారికి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలని , బీచ్ తీర ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ కు, జోనల్ కమిషనర్ శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు శాంతిరాజు మురళీకృష్ణ సహాయక వైద్యాధికారులు బి.ప్రసాదరావు, కృష్ణంరాజు, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, వార్డ్ శానిటరీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.