ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. ఆదివారం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచిన సందర్భంలో జరిగిన నిరసన కార్యక్రమంలో అరెస్ట్ అయి జిల్లా జైలులో ఉన్న పగడాల నాగరాజును ఆయన కలిసి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నాగరాజుకు పూర్తి మద్దతు ఉంటుందని, త్వరలోనే బెయిల్ తీసుకొని విడుదల చేయిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మురళి, కూరాకుల నాగభూషణం తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.



