జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి)
పూలే జయంతి సందర్భంగా బిసి ఐక్యతా భవన్
కావలి ఏరియా హాస్పిటల్ లో మరో సారి మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది.
భవన్ వ్యవస్థాపకులు, పాత్రికేయులు చిన్ని వరప్రసాద్ రక్తదాన కార్యక్రమం తో కావలి నలుమూలల నుంచి బలహీన వర్గాల నేతలను ఒక వేదిక మీదకు సమీకరించడం విశేషం.
సుమారు నలభై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కావలి ఏరియా ఆసుపత్రి లో రక్తదానం చేయడం వలన ప్రజలకు నేరుగా ప్రతి రక్తపు చుక్క అందుతుందనే ఆశయం తో తమ సంఘం ఇక్కడే నిర్వహిస్తున్నట్లు వర ప్రసాద్ తెలిపారు. దేశ సేవ కోసం పూలే దంపతులు పిల్లలు వద్దనుకొని ఆదర్శ దంపతులయ్యారు. ఆనాటి కాలంలో మహిళలకు విద్య నిషేధం నడుస్తున్న తరుణంలో పూలే దంపతులు మహిళలకు, బాలికలకు విద్యను అందించిన ఘనత వారికే దక్కిందని వారికి భారతరత్న ఇవ్వాలని ప్రసాద్ కోరారు. రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన యువత సమాజ అభివృద్ధిలో కీలకం అయ్యేందుకు తమ బి.సి భవన్ కృషి చేస్తుందని ప్రసాద్ తెలిపారు.
ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విజయవేణి మాట్లాడుతూ బి.సి భవన్ నిర్వాహకులు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతి సారి ఇక్కడే రక్తదానం చేయడం హర్షణీయం అని, ఏరియా ఆసుపత్రి కి ఎంతో అండగా నిలిచినట్లు అని అభినందించారు.
ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనసేన కావలి ఇంచార్జి అళహరి సుధాకర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సహాయ కార్యదర్శి ముక్కు మురళీమోహన్ డాక్టర్ రోహిత్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సాయి, సేవా సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, రోటరీ క్లబ్ కార్యదర్శి మొగల్ సలీం, బిజెపి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్
పూలమాల వేసి నివాళులు అర్పించి బి.సి లసంక్షేమానికి పాటుపడుతున్న బి.సి.భవన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ ను అభినందించారు.
వర ప్రసాద్ పిలుపు మేరకు యువకులు కొత్తగా స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం అని ప్రసాద్ భవిష్యత్తు లో బి.సి ల సంక్షేమం కు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ప్రశంసించారు.
. బ్లడ్ వారియర్ టీం సభ్యులు వినయ్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ అలీం, షేక్ ఖరీర్బీ, సోమిశెట్టి బ్రహ్మయ్య, భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.
బి.సి.భవన్ మరోసారి రక్తదాన శిబిరం ప్రసాద్ పిలుపు కి యువత స్పందన
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) పూలే జయంతి సందర్భంగా బిసి ఐక్యతా భవన్ కావలి ఏరియా హాస్పిటల్ లో మరో సారి మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. భవన్ వ్యవస్థాపకులు, పాత్రికేయులు చిన్ని వరప్రసాద్ రక్తదాన కార్యక్రమం తో కావలి నలుమూలల నుంచి బలహీన వర్గాల నేతలను ఒక వేదిక మీదకు సమీకరించడం విశేషం. సుమారు నలభై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కావలి ఏరియా ఆసుపత్రి లో రక్తదానం చేయడం వలన ప్రజలకు నేరుగా ప్రతి రక్తపు చుక్క అందుతుందనే ఆశయం తో తమ సంఘం ఇక్కడే నిర్వహిస్తున్నట్లు వర ప్రసాద్ తెలిపారు. దేశ సేవ కోసం పూలే దంపతులు పిల్లలు వద్దనుకొని ఆదర్శ దంపతులయ్యారు. ఆనాటి కాలంలో మహిళలకు విద్య నిషేధం నడుస్తున్న తరుణంలో పూలే దంపతులు మహిళలకు, బాలికలకు విద్యను అందించిన ఘనత వారికే దక్కిందని వారికి భారతరత్న ఇవ్వాలని ప్రసాద్ కోరారు. రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన యువత సమాజ అభివృద్ధిలో కీలకం అయ్యేందుకు తమ బి.సి భవన్ కృషి చేస్తుందని ప్రసాద్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విజయవేణి మాట్లాడుతూ బి.సి భవన్ నిర్వాహకులు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతి సారి ఇక్కడే రక్తదానం చేయడం హర్షణీయం అని, ఏరియా ఆసుపత్రి కి ఎంతో అండగా నిలిచినట్లు అని అభినందించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనసేన కావలి ఇంచార్జి అళహరి సుధాకర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సహాయ కార్యదర్శి ముక్కు మురళీమోహన్ డాక్టర్ రోహిత్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సాయి, సేవా సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, రోటరీ క్లబ్ కార్యదర్శి మొగల్ సలీం, బిజెపి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ పూలమాల వేసి నివాళులు అర్పించి బి.సి లసంక్షేమానికి పాటుపడుతున్న బి.సి.భవన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ ను అభినందించారు. వర ప్రసాద్ పిలుపు మేరకు యువకులు కొత్తగా స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం అని ప్రసాద్ భవిష్యత్తు లో బి.సి ల సంక్షేమం కు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ప్రశంసించారు. . బ్లడ్ వారియర్ టీం సభ్యులు వినయ్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ అలీం, షేక్ ఖరీర్బీ, సోమిశెట్టి బ్రహ్మయ్య, భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

