అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్న బీసీ హాస్టల్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మండల నాయకులు, కర్రతోటే హరి నారాయణ, మంగళవారం సందర్శించి, అక్కడ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా దోమలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక పోతున్నామని, వాటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సిఐటియు నాయకులు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, తక్షణం 15వ ఫైనాన్సు నిధులు కింద, దోమలు నివారణ కోసం,ప్యాగీ0గ్ చేయాలని చెప్పడం జరిగినది. మిషను చెడిపోయి ఉన్నది. ఏదో విధంగా స్ప్రే చేపిస్తానని హామీ ఇచ్చారు. వర్షం వస్తే రూములు తడుస్తున్నాయని, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రత్యమ్న ఏర్పాటు చేయాలని, రూములు రిపేర్ చేయించాలని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. పెద్ద పిల్లలకు నెలకు 150 రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బట్టలు ఉతుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా, నూనెలు, చెప్పులు, కట్టింగులకు, ఇన్ని నెలల ఇవ్వకుంటే ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తక్షణం ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

బిసి హాస్టల్ పరిశీలించిన సిఐటియు జిల్లా నాయకులు!సమస్యల పరిష్కరించాలని డిమాండ్