Wednesday, 25 March 2026
  • Home  
  • బిజెపి సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ ల వర్క్ షాప్ నందు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ప్రశంగం
- హైదరాబాద్

బిజెపి సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ ల వర్క్ షాప్ నందు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ప్రశంగం

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ : తెలంగాణ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృస్ట్యా బైరామల్ గూడా లో బిజెపి రాష్ట్ర స్థాయి మీడియా, ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్ లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు బిజెపి రాష్ట్ర, జాతీయ నేతలతో కలిసి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సం దర్భముగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ 👉సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే. 👉సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు. 👉సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదు. 👉సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. 👉అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు — ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. 👉రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. 👉కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు. 👉రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. 👉ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ చౌరస్తాలో ఉన్నారు. వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా, మీడియా మీదే ఉంది. 👉గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయి. 👉కానీ “సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయి. 👉స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. 👉అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాను. 👉ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్బి, జెపి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ ప్రేమ్ శుక్ల, గోవా బిజెపి ఐటీ ఇంచార్జి శ్రీ గిరిరాజ్ మాలూ పాయ్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్. ప్రకాష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి శ్రీ ఎన్.వీ.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతి నిధి

హైదరాబాద్ : తెలంగాణ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృస్ట్యా బైరామల్ గూడా లో బిజెపి రాష్ట్ర స్థాయి మీడియా, ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్ లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు బిజెపి రాష్ట్ర, జాతీయ నేతలతో కలిసి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు.
ఈ సం దర్భముగా
ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ

👉సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే.

👉సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు.

👉సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదు.

👉సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది.

👉అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు — ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది.

👉రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

👉కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు.

👉రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.

👉ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ చౌరస్తాలో ఉన్నారు. వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా, మీడియా మీదే ఉంది.

👉గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయి.

👉కానీ “సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయి.

👉స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి.

👉అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాను.

👉ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్బి, జెపి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ ప్రేమ్ శుక్ల, గోవా బిజెపి ఐటీ ఇంచార్జి శ్రీ గిరిరాజ్ మాలూ పాయ్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్. ప్రకాష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి శ్రీ ఎన్.వీ.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.