పున్నమి ప్రతినిధి
హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఘన విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి, అనుసరించాల్సిన వ్యూహాలను గురించి బిజెపి ముఖ్య నాయకులకు రామ చందర్ది రావు దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి హాజరయ్యారు.


