ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారు భారతమాత దాస్య శృంఖలాలను తెంచడం కోసం తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా భావించి దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో భారతమాత వీరపుత్రులను స్మరించుకుంటూ ఈ స్వతంత్ర భారతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో “వికసిత్ భారత్” నినాదంతో దేశంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమం సంబంధించిన తదితర అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ప్రేరణతో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే అవ్వాలి అనే దృఢ సంకల్పంతో మనమందరము కదం తొక్కాలి అని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా మరియు మండల నాయకులు,కార్యకర్తలు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు


