ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులున్న అభివృద్ధి మాత్రం శున్యం అని బిజెపి ఖమ్మం జిల్లా యువ నాయకులు వాళ్ళలా రమేష్ అన్నారు. గురు వారం స్థానిక సమస్య ల మీద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రమేష్ మాట్లాడుతూ ఖమ్మం బైపాస్ నుండి కామంచి కల్ వెళ్లే రహదారి సమస్య ఇప్పటి ది కాదు అని పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో ఇదే అంశం ని ప్రధాన ఎజెండా గా మార్చుకొని ఓట్లు వేయించుకొని గెలిచినా తరువాత పట్టించుకునే నాయకుడే లేరన్నారు. ఈ సమస్య
కి వెంటనే పరిష్కారం చూపకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అని రమేష్ హెచ్చరించారు. ఈ సమావేశం లో ఏపూరి నాగేశ్వరరావు, గజ్జల శ్రీనివాస్, అంకర్ల వీరబాబు, ములుగు చందు, కందుల శ్రీకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, టిడిపి పార్టీ నాయకులు ఆటో కార్మికులు పాల్గొనడం జరిగింది


