మనుబోలు (పున్నమి విలేఖరి)6, డిసెంబర్ :మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం అని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు 64 వ వర్ధంతి కార్యక్రమాన్ని మనుబోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పాలన సజావుగా, సాఫీగా సాగడానికి బి.ఆర్.అంబేద్కర్ రచించి, మనకు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణం అన్నారు .బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ
దళితులు, అణగారిన వర్గాలు, బలహీనవర్గాల ఉన్నతి కోసం జీవిత కాలం పోరాటం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయణిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించనదని అన్నారు.
మహనీయుడు బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కలిసి పని చేద్దాం అని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి షేక్. షఫీ మండల ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా. లక్ష్మయ్య,బిజెపి రాష్ట్ర నాయకుడు మస్తాన్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మైనార్టీ మోర్చ్ అధ్యక్షుడు అల్లాభక్షు, పట్నం.వీరప్రతాప్, ఉప్పు. మనెయ్య, తురక. అంకయ్య, రాచురు. వెంకయ్య, రాజాయాదవ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో మహనీయునికి ఘనంగా నివాళులు
మనుబోలు (పున్నమి విలేఖరి)6, డిసెంబర్ :మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం అని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు 64 వ వర్ధంతి కార్యక్రమాన్ని మనుబోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పాలన సజావుగా, సాఫీగా సాగడానికి బి.ఆర్.అంబేద్కర్ రచించి, మనకు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణం అన్నారు .బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాలు, బలహీనవర్గాల ఉన్నతి కోసం జీవిత కాలం పోరాటం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయణిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించనదని అన్నారు. మహనీయుడు బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కలిసి పని చేద్దాం అని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి షేక్. షఫీ మండల ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా. లక్ష్మయ్య,బిజెపి రాష్ట్ర నాయకుడు మస్తాన్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మైనార్టీ మోర్చ్ అధ్యక్షుడు అల్లాభక్షు, పట్నం.వీరప్రతాప్, ఉప్పు. మనెయ్య, తురక. అంకయ్య, రాచురు. వెంకయ్య, రాజాయాదవ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.