తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
బిక్కవోలు, 2 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) :
బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి “షష్ఠి” మహోత్సవం ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
అనంతరం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి “షష్ఠి” మహోత్సవం ముగింపు సందర్బంగా విశిష్ట సేవలు అందించిన రెవిన్యూ సిబ్బందిని, మండల ప్రజా పరిషత్ సిబ్బందిని, పోలిస్ వారిని, దేవాదాయ శాఖ సిబ్బందిని, బిక్కవోలు పంచాయతీ సిబ్బందిని, ఆలయ కమిటీ సభ్యులను, గ్రామస్థులను సత్కరించి, జ్ఞాపికను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


