Tuesday, 24 March 2026
  • Home  
  • బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు
- నిర్మల్

బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు

నిర్మల్ జిల్లా-బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ ప్రతిపాదనకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి బాసర నుండి మహోర్ (హిమాయత్‌నగర్) వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారి ద్వారా రెండు జాతీయ రహదారులు అనుసంధానం కానున్నాయి. దీనిపై సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత మే 5న ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ న్యూఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలుసుకొని, ఈ రహదారి అవసరాన్ని వివరించారు. బాసర అమ్మ వారి ఆలయం నుండి మహోర్‌లోని రేణుక మాత ఆలయానికి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి కేంద్రం స్పందించగా, మంత్రి నితిన్ గడ్కరి ఈ విషయాన్ని అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు. కేంద్రం ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్ జిల్లా-బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు

ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ ప్రతిపాదనకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

బాసర నుండి మహోర్ (హిమాయత్‌నగర్) వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారి ద్వారా రెండు జాతీయ రహదారులు అనుసంధానం కానున్నాయి. దీనిపై సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

గత మే 5న ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ న్యూఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలుసుకొని, ఈ రహదారి అవసరాన్ని వివరించారు. బాసర అమ్మ వారి ఆలయం నుండి మహోర్‌లోని రేణుక మాత ఆలయానికి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తికి కేంద్రం స్పందించగా, మంత్రి నితిన్ గడ్కరి ఈ విషయాన్ని అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు. కేంద్రం ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.