తిరుపతి, జనవరి 4 పున్నమి ప్రతినిధి (రోసి రెడ్డి)
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న సంక్షేమ చర్యలు ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ వసంత స్పష్టం చేశారు. ఆదివారం టిటిడి పరిపాలన భవనంలో కార్యనిర్వహణాధికారి అశోక్ సింఘాల్ ను బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ తో పాటు మరియు సభ్యులు కలిసి పలు అంశాలపై చర్చించారు. బాలికల సంక్షేమ వసతి గృహంలోని పిల్లలకు పలు అంశాలలో పలు అంశాలలో శిక్షణ ఇవ్వడంలో టిటిడి చర్యలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వసతి గృహంలోని పిల్లలు తయారుచేసిన పూల మాలలు మరియు బ్యాగులు టీటీడీ కొనుగోలు చేయడం వల్ల వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించడం పట్ల హర్షం ప్రకటించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం భవిష్యత్తులో టీటీడీ తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మురళి మోహన్, కృష్ణమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


