ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഡോ. ബി.ആർ. അംബേദ്കർ കോനസീമ

బాల కార్మికుల గుర్తింపు.. ఆరుగురు ఇటుక బట్టీల యజమానులపై కేసులు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
బాల కార్మికుల గుర్తింపు.. ఆరుగురు ఇటుక బట్టీల యజమానులపై కేసులు

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • Uploaded Video:

అంబేద్కర్ కోనసీమ జిల్లా: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆలమూరు మండలం తాళ్లపొలం, ఆలమూరు గ్రామాల్లోని ఇటుక బట్టీలను శుక్రవారం కార్మిక శాఖ అధికారులతో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని బట్టీల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించడంతో ఆరుగురు యజమానులపై కేసులు నమోదు చేశారు. బాలల తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి, పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. బాల కార్మికులతో పనిచేయిస్తే ఉపేక్షించబోమని యజమానులను హెచ్చరించారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Uploaded Video:

బాల కార్మికుల గుర్తింపు.. ఆరుగురు ఇటుక బట్టీల యజమానులపై కేసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *