బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పలమనేరు ఆర్డీవో భవానీ అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల చట్టాలపై అవగాహన, బాల్య వివాహాల నిర్మూలన చేపట్టడమే శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. బాలలకు సంబంధించిన చట్టాలు, శిక్షలు బాల్యవివాహాలు నిరోధక చట్టం 2006, బాలలపై లైంగిక నిరోధక చట్టం, ఉచిత నిర్బంధ విద్య, లింగ నిర్ధారణ పరీక్ష చట్టం యొక్క తీవ్రత గురించి క్షుణ్ణంగా వివరించారు. గ్రామస్థాయిా సీఎం వీవోల ఫోన్ నెంబర్లను ప్రతి స్కూల్ నందు నోటీస్ బోర్డులో ఉంచాలని వారు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి తమ వంతు బాధ్యతగా కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజంలో బాలలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడంతో పాటు మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్ధాలపై సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయ పరిధిలో దీనిపై ఒక రిజిష్టరు నిర్వహణలో ఉంచాలన్నారు. డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల్య వివాహాల చట్టం, లైంగిక నేరాల చట్టాలపై శిక్షణ అందించారు. లీగల్ ప్రొఫెషన్ ఆఫీసర్ ఎంఎస్ వెంకటేశులు జోనల్ జస్టిస్ ఆక్ట్ 2015 గురించి వివరించారు. ప్రొటెక్షన్ ఆఫీస్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్ సి.శివశంకర్ అడాప్షన్ ప్రాసెస్, స్పాన్సర్షిప్ గురించి వివరించారు. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్ రాధా రాణి మాట్లాడుతూ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ సేవల గురించి వివరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ డిస్టిక్ కోఆర్డినేటర్ నాగమణి 1098 సర్వీస్ గురించి, ఉమెన్ హెల్ప్ లైన్ అండ్ సర్వీసెస్ 181 వివరించారు. డిఈఎమ్‌వో అండ్ డిఎం అండ్ హెచ్‌వో జయరాముడు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్న అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవోలు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, వార్డ్ అండ్ విలేజ్ సెక్రెటరీలు,డిస్ట్రిక్ట్‌ూ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ సిబ్బంది, ఉమెన్స్ హెల్ప్ లైన్ సర్వీసెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి : ఆర్డీవో*