Tuesday, 24 March 2026
  • Home  
  • బాలికల ప్రాధాన్యతపై అవగాహన — ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు
- అన్నమయ్య

బాలికల ప్రాధాన్యతపై అవగాహన — ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

చిట్వేలు, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా చిట్వేలు మండలంలోని వివిధ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీబీవీ స్కూల్, వెంకటరాజుపల్లి హైస్కూల్‌లలో బాలికల ప్రాముఖ్యత, జెండర్ ఈక్వాలిటీ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంలో విద్యార్థులలో ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వర్లు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖ రాణి అధ్యక్షత వహించగా, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం దుర్గారాజు, ఎస్. రవి, తులసి మరియు అధ్యాపక బృందం సభ్యులు పాల్గొన్నారు. బాలికల సమాన హక్కులు, విద్యలో వారి ప్రాధాన్యతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు అందించారు.

చిట్వేలు, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి)

అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా చిట్వేలు మండలంలోని వివిధ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీబీవీ స్కూల్, వెంకటరాజుపల్లి హైస్కూల్‌లలో బాలికల ప్రాముఖ్యత, జెండర్ ఈక్వాలిటీ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంలో విద్యార్థులలో ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వర్లు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖ రాణి అధ్యక్షత వహించగా, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం దుర్గారాజు, ఎస్. రవి, తులసి మరియు అధ్యాపక బృందం సభ్యులు పాల్గొన్నారు. బాలికల సమాన హక్కులు, విద్యలో వారి ప్రాధాన్యతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.