బాబు పర్యటనను విజయవంతం చేద్దాం
నెల్లూరు, అక్టోబర్ 11 (పున్నమి విలేకరి) : జిల్లాలో ఈ నెల 14,15 వ తేదీలలో మాజీ సియం చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్ పేర్కొన్నారు. 14వ తేదిన జిల్లా విసత స్థాయి సమావేశం జరుగుతుందని, నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికార పార్టీ బాధితులతో సమావేశం నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మాజీ సియం పర్యటనలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూనే, అధికార పార్టీ బాధితులకు బరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలబించిన ప్రభుత్వం ఇదేనని ఆయన విమర్శించారు. వైఎస్‌అర్ కంపెనీ లిమిటెడ్‌గా రాష్టాన్ని మార్చారని ఆయన దుయ్యబట్టారు. ఇసుక అక్రమంగా ఇతర రాష్టాలకు తరలిపోతుంది.ఇందులో అదికార నాయకులకే అగ్రబాగంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మద్య నిషేధం అంటు మద్యం రేట్లు పెంచి అమ్ముతున్నారు.త్వరలో మద్యం అమ్మకాలు వారి పార్టీ కార్యకర్తలకు అప్ప చెబుతారని ఇది దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు మండల స్థాయి అదికారుల పై దాడులు జరుగుతున్నాయి.త్వరలో జిల్లా, రాష్ట స్థాయికి చేరుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. రైతు బరోసా 12500ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చే 6000ను కలుపుకున్నదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గతంలో మేము అన్నదాత సుఖీభవ లో15000 ఇవ్వడాన్ని మేము ప్రారంబించి 4వేలు ఇచ్చామని రాష్టం ఇప్పుడు ఇచ్చే రైతు బరోసాలో కేంద్రము ఇచ్చే 6వేలును కలుపుకుంటున్నారా..లేక 12500 మీరు స్వంతంగా ఇస్తున్నారా! అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రీటెండరింగ్ విధానాన్ని ప్రవేవపెట్టి దానిని అయోమయంగా చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో మీరు విమర్శించిన కాంట్రాక్టు కంపెనీకి మీరు అదే పనిని కట్డ బెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని కంప్లీట్ చేయలేదని, వెంటనే కేంద్రము ఈ ప్రాజెక్టు ను వెంటనే హ్యాండోవర్ చేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయాలని సోమిరెడ్డి తెలియచేశారు. ఎన్ అర్ జిసి పథకంలో కేంద్రం విడుదల చేసిన రాష్టం ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. వచ్చిన నిధులకు రాష్ట ప్రభుత్వ వాటా కలుపుకొని మూడు రోజుల్లో విడుదల చేయక పోతే 12% వడ్డీతో సహా కట్టి ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ముందుగా చేసిన పనులకు ముందుగా బిల్లు చెల్లించాలి. నీరు చెట్టు పనులు చేసిన వారి వల్ల పార్టీ నష్టపోతుందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మెండి వైఖరి వల్ల రాష్టం నష్ట పోతుందని ఆయన తెలిపారు. రాష్టం మీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కాదని ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమని దీనిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్డము -43శాతం గ్రోత్‌లో వెనుకబడి పోయిందని బాబు పాలనలో రాష్ట్రం ముందంజలో వుండేదని ఆయన పేర్కొన్నారు.


