
పోలాకి, జూలై 20:
పోలాకి మండలం చెల్లాయివలస గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తర్ర సావిత్రమ్మ గారిని, వాహన ప్రమాదంలో గాయపడి కాలు శస్త్రచికిత్స చేయించుకున్న గేదెల నరసింహులు గారిని, ఇటీవల మరణించిన అలిగి రాములమ్మ కుటుంబ సభ్యులను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు పరామర్శించారు.
బాధితుల కుటుంబాలను ఆయన మనోబలం నింపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల అవసరాలను గమనించి తమవంతుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రజల్లో హృదయాన్ని తాకిన చర్యగా ప్రశంసలు అందుకుంది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, చింతు రామకృష్ణ, మండల యూత్ ఉపాధ్యక్షులు పాసిన రమణ, బమ్మిడి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు.


