Tuesday, 24 March 2026
  • Home  
  • బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షే లక్ష్యం – అన్నమయ్య జిల్లా ఎస్పీ
- అన్నమయ్య

బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షే లక్ష్యం – అన్నమయ్య జిల్లా ఎస్పీ

రాయచోటి, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి) జిల్లాలో బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ సమావేశ మందిరంలో కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ – కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని పెండింగ్ సమన్లు, వారెంట్లు తక్షణమే అమలు జరగేలా చర్యలు తీసుకోవాలని కొత్త బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి కోర్టు కానిస్టేబుల్ తన స్టేషన్‌కు సంబంధించిన కేసులపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నేరస్థలంలో ఫోటోలు, వీడియో రికార్డింగ్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆధునిక ట్యాబ్‌లను ఎస్పీ గారు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎ. ఆదినారాయణ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ యం. తులసిరామ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి. రాజా రమేష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి. మధు, ఎస్ఐ జి. రవికుమార్, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

రాయచోటి, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి)

జిల్లాలో బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ సమావేశ మందిరంలో కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎస్పీ మాట్లాడుతూ –

కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని

పెండింగ్ సమన్లు, వారెంట్లు తక్షణమే అమలు జరగేలా చర్యలు తీసుకోవాలని

కొత్త బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు.

అదే విధంగా ప్రతి కోర్టు కానిస్టేబుల్ తన స్టేషన్‌కు సంబంధించిన కేసులపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నేరస్థలంలో ఫోటోలు, వీడియో రికార్డింగ్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆధునిక ట్యాబ్‌లను ఎస్పీ గారు అందజేశారు.

సమావేశంలో అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎ. ఆదినారాయణ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ యం. తులసిరామ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి. రాజా రమేష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి. మధు, ఎస్ఐ జి. రవికుమార్, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.