*బాధితురాలి ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కురవి పోలీసులు..!! వేగంగా స్పందించిన తీరుకు ప్రశంసలు..👌*మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామంలో జరిగిన గొడవ సంఘటనలో కురవి పోలీసులు తక్షణమే స్పందించి *బాధితురాలి ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు* చేసి తమ నిబద్ధతను చాటుకున్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలను స్థానిక ప్రజలు ప్రశంసించారు. *రాజోలు గ్రామానికి చెందిన కొమ్మరాజుల వీరభద్రమ్మ* కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో ఆమె ఇంటి ముందు ఆటో నిలిపే విషయంలో పొరుగువారైన *గుంజ రాజు, గుంజ యశోద మరియు వారి కుమారుడు సురేష్తో వివాదం చోటుచేసుకుంది.* ఈ గొడవ క్రమంలో ముగ్గురు కలిసి ఆమెపై చేతులతో, కర్రతో దాడి చేయగా, *వీరభద్రమ్మ కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.* ఈ ఘటనపై *సమాచారం అందుకున్న వెంటనే కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్,* పోలీస్ సిబ్బంది ఆలస్యం చేయకుండా బాధితురాలి ఇంటికే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. *అక్కడే బాధితురాలి నుండి పిర్యాదు స్వీకరించి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.*


