చిట్వేలి(పున్నమి ప్రతినిధి) జూలై 29
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోలోపల్లి గ్రామం కు చెందిన కోటేశ్వర రావు అనే యువకునికి చేతిలో బాణాసంచ పేలి తీవ్రంగా గాయాలయ్యాయి. స్నేహితుని బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా కోటేశ్వర రావు తప్పతాగి నాటు రాకెట్ చేతితో పట్టుకొని వెలిగించగా, చేతిలో పేలి తీవ్ర గాయాలయ్యాయి. హుటా హుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కంటికి, చేతులకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాణాసంచా చేతిలో పేలి తీవ్రంగా గాయపడ్డ పోలోపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు
చిట్వేలి(పున్నమి ప్రతినిధి) జూలై 29 అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోలోపల్లి గ్రామం కు చెందిన కోటేశ్వర రావు అనే యువకునికి చేతిలో బాణాసంచ పేలి తీవ్రంగా గాయాలయ్యాయి. స్నేహితుని బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా కోటేశ్వర రావు తప్పతాగి నాటు రాకెట్ చేతితో పట్టుకొని వెలిగించగా, చేతిలో పేలి తీవ్ర గాయాలయ్యాయి. హుటా హుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కంటికి, చేతులకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.