*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
*పోలీసు కమిషనర్ గారి అదేశాలతో బాణసంచా సామాగ్రి అక్రమ నిల్వల పై నగర వ్యాప్తముగా మెరుపు దాడులు*
నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ వారు ఈరోజు అనగా 18.10.2025 న మధ్యాహ్నం నుండి వారి సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించడం జరిగినది.
క్రింద పేర్కొన్న వారు ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచా నిల్వలు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి బాణసంచా సామాగ్రి, స్వాధీనపర్చుకొని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు అప్పగించడమయినది. బాణసంచా సామాగ్రి అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడమైనది.
ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన సూరి కిషోర్, 42 సంవత్సరాలు వద్ద 70,000/- రూపాయలు విలువ గల అక్రమ బాణా సంచా స్వాధీనం.
ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.


