ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి)
చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు యాజమాన్యం వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు మరణించిన 19 మందికి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన నలుగురికి రూ.50 వేల చొప్పున రూ.40 లక్షల చెక్ ను కలెక్టరేట్ లో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు టి.జి. భరత్,జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత లకు అందించారు.


