నందలూరు మండలం లోని ప్రధాన బస్టాండ్ సమీపంలో కూతవేటు దూరంలోనే చెత్తను పారవేస్తూ, ఆ ప్రదేశం పూర్తిగా డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది. ఈ మార్గం గుండా వెళ్తున్నా ప్రజలకి,చెత్త దిబ్బల వల్ల దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ చెత్త కారణంగా దోమలు,పందులు,దుర్వాసనలు విస్తరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
చెత్త కుప్పల్లో కుళ్ళిపోతున్న వ్యర్థాలు పలు రకాల వ్యాధులకు కారణమవుతుండగా,పిల్లలు, వృద్ధులు తరచుగా జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
ప్రజలు పంచాయతీ అధికారులను వెంటనే చర్యలు తీసుకుని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలని,చెత్త పారవేసే ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు అదే దారిలో తరచూ వెళ్తున్న ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు కూడా ఈ దృశ్యాన్ని చూసినా కనీసం స్పందించడం లేదు.

బస్టాండ్‌కు దగ్గరగా చెత్త దిబ్బ — ప్రజల ఆరోగ్యానికి ముప్పు
నందలూరు మండలం లోని ప్రధాన బస్టాండ్ సమీపంలో కూతవేటు దూరంలోనే చెత్తను పారవేస్తూ, ఆ ప్రదేశం పూర్తిగా డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది. ఈ మార్గం గుండా వెళ్తున్నా ప్రజలకి,చెత్త దిబ్బల వల్ల దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ చెత్త కారణంగా దోమలు,పందులు,దుర్వాసనలు విస్తరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చెత్త కుప్పల్లో కుళ్ళిపోతున్న వ్యర్థాలు పలు రకాల వ్యాధులకు కారణమవుతుండగా,పిల్లలు, వృద్ధులు తరచుగా జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజలు పంచాయతీ అధికారులను వెంటనే చర్యలు తీసుకుని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలని,చెత్త పారవేసే ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు అదే దారిలో తరచూ వెళ్తున్న ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు కూడా ఈ దృశ్యాన్ని చూసినా కనీసం స్పందించడం లేదు.

