అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, గంగమ్మ తల్లి ముద్దు అంటూ గత 38 రోజులుగా శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తున్న మత్యకారుల కు అండగా పూడిమడక గ్రామంలో గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము , పూడిముడక శాఖ కార్యదర్శి చాపల తాతయ్య, మండల కమిటీ సభ్యులు కె సోమునాయుడు మాట్లాడుతూ రాజయ్యపేట వద్ద 1270 ఎకరాల్లో అత్యంత కాలుష్యకారక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది దీన్ని నిరసిస్తూ మత్స్యకారులు శాంతియుత ఆందోళన చేస్తున్న మత్యకార గ్రామంలో సెక్షన్ 30 , పోలీస్ పికెట్లు పెట్టి ప్రజానీకాన్ని భయభ్రాంతులను గురిచేస్తున్నారు, పోరాటానికి మద్దతు తెలుపుతున్న నాయకులను నిర్బంధిస్తున్నారు, గతంలో తెలుగుదేశం బల్క్ డ్రగ్ పార్క్ ని తీవ్రంగా వ్యతిరేకించింది అధికరంలోకి వచ్చిన తర్వాత నిర్బంధం ప్రయోగించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది, సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్యకారులకు కాలుష్య కారక పరిశ్రమ లు పెట్టి మత్య వృత్తి కి దూరం చేస్తున్నారు, మత్స్యకారులకు స్థానిక పరిశ్రమల్లో పనులు కల్పించడం లేదు దీంతో మరింత దుర్భర పరిస్థితుల్లోకి మత్స్యకారులు నెట్ట బడుతున్నారు ప్రభుత్వం పోలీసు నిర్బంధం ఎత్తివేసి ప్రజాబిస్టం మేరకు బల్క్ డ్రగ్ పార్కు ప్రతిపాదనలు విరమించుకోవాలని, మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మత్యకార గ్రామాలందరూ మద్దతు తెలియజేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో కృష్ణ , అమ్మోరు, గంటల రావు , రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


