Sunday, 7 December 2025
  • Home  
  • బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం.
- విశాఖపట్నం

బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం.

బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం. *ఫిబ్రవరి ఆఖరుకు బయోమైనింగ్ కార్యాచరణను పూర్తి చేయండి. -కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో గల బయో సి ఎన్ జి (బయో గ్యాస్), బయో మైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తినిచ్చిందని, బయో మైనింగ్ ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖా, స్వచ్ఛభారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా అధికారులకు సూచించారు. గురువారం ఆమె మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కాపులుప్పాడ లో గల డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న బయో గ్యాస్ , బయో మైనింగ్ ప్లాంట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ కాపులుప్పాడలోని బయో గ్యాస్ ప్లాంట్ ఎప్పుడు మొదలైందని, రోజులో ఎన్ని టన్నులు గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని, గ్యాస్ రేటు ఏ విధంగా ఉందని, బయో గ్యాస్ ప్లాంట్ కు వ్యర్ధాలను ఏ విధంగా సేకరిస్తున్నారని ఆరా తీశారు. బయో గ్యాస్ ప్లాంట్ నిర్వహిస్తున్న వైజాగ్ బయో ఎనర్జీ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కేఎస్ రాజు మాట్లాడుతూ రోజుకు 30 టన్నుల వెజిటబుల్ , ఫుడ్ వేస్ట్ ప్లాంట్ కు వస్తుందని , వాటి ద్వారా సుమారు 1000 కేజీలు బయో సి ఎన్ జి ( కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ) ఉత్పత్తి జరుగుతుందని, 30 వేల లీటర్లు లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఉత్పత్తి జరుగుతుందని, అది రైతులకు , నగరంలో జీవీఎంసీ అభివృద్ధి చేస్తున్న గార్డెన్ లకు సరఫరా చేయడం జరుగుతుందని ,అలాగే రోజుకు నాలుగు టన్నుల వరకు సాలిడ్ మెన్యూర్ ఉత్పత్తి అవుతుందని అది కూడా రైతుల ఆర్గానిక్ ఫార్మింగ్ కొరకు రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని , అదనంగా ట్రైల్ బేసిస్ లో ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ ( PROM) మార్కెట్లో విడుదల చేయుట కొరకు డెవలప్ చేయబడుతుందని జాయింట్ సెక్రటరీకు , కమిషనర్ కు వివరించగా…, జాయింట్ సెక్రెటరీ బయోగ్యాస్ ప్లాంటు లో కలియతిరిగి జరుగుతున్న వేస్ట్ ప్రాసెస్ ను , అక్కడ ఉత్పత్తి అయిన పలు ఆర్గానిక్ మెన్యూర్ లను, లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ను పరిశీలించి ప్లాంట్ నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కు సూచించారు. అనంతరం జాయింట్ సెక్రెటరీ బయోమైనింగ్ ప్లాంట్ ను సందర్శించి ,బయో మైనింగ్ ఇప్పటివరకు ఎన్ని లక్షల టన్నులు చేశారని అడిగి తెలుసుకుని, మొత్తం 14 లక్షల టన్నుల వ్యర్ధాలలో ఆఖరు దశలో మూడు లక్షల టన్నులు నిర్వహిస్తే పూర్తవుతుందని అధికారులు తెలపగా బయో మైనింగ్ ఇంకా మెరుగైన విధంగా నిర్వహించాలన్న దానిపై ఆలోచించాలని, బయో మైనింగ్ నిర్వహణ సంతృప్తినిచ్చిందని ,బయోమైనింగ్ నిర్వహణ 2026 ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని , జీవీఎంసీ కమిషనర్ కు జాయింట్ సెక్రటరీ సూచిస్తూ… బయోగ్యాస్ ,బయోమైనింగ్ ప్లాంట్లు నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్ గోవిందరావు, సహాయక వైద్యాధికారి డాక్టర్ ఎల్ .రవి కుమార్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పి ఎస్ ఆర్ మూర్తి, శానిటరీ సూపర్వైజర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు

బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం.

*ఫిబ్రవరి ఆఖరుకు బయోమైనింగ్ కార్యాచరణను పూర్తి చేయండి.

-కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా.

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో గల బయో సి ఎన్ జి (బయో గ్యాస్), బయో మైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తినిచ్చిందని, బయో మైనింగ్ ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖా, స్వచ్ఛభారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా అధికారులకు సూచించారు. గురువారం ఆమె మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కాపులుప్పాడ లో గల డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న బయో గ్యాస్ , బయో మైనింగ్ ప్లాంట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ కాపులుప్పాడలోని బయో గ్యాస్ ప్లాంట్ ఎప్పుడు మొదలైందని, రోజులో ఎన్ని టన్నులు గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని, గ్యాస్ రేటు ఏ విధంగా ఉందని, బయో గ్యాస్ ప్లాంట్ కు వ్యర్ధాలను ఏ విధంగా సేకరిస్తున్నారని ఆరా తీశారు.

బయో గ్యాస్ ప్లాంట్ నిర్వహిస్తున్న వైజాగ్ బయో ఎనర్జీ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కేఎస్ రాజు మాట్లాడుతూ రోజుకు 30 టన్నుల వెజిటబుల్ , ఫుడ్ వేస్ట్ ప్లాంట్ కు వస్తుందని , వాటి ద్వారా సుమారు 1000 కేజీలు బయో సి ఎన్ జి ( కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ) ఉత్పత్తి జరుగుతుందని, 30 వేల లీటర్లు లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఉత్పత్తి జరుగుతుందని, అది రైతులకు , నగరంలో జీవీఎంసీ అభివృద్ధి చేస్తున్న గార్డెన్ లకు సరఫరా చేయడం జరుగుతుందని ,అలాగే రోజుకు నాలుగు టన్నుల వరకు సాలిడ్ మెన్యూర్ ఉత్పత్తి అవుతుందని అది కూడా రైతుల ఆర్గానిక్ ఫార్మింగ్ కొరకు రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని , అదనంగా ట్రైల్ బేసిస్ లో ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ ( PROM) మార్కెట్లో విడుదల చేయుట కొరకు డెవలప్ చేయబడుతుందని జాయింట్ సెక్రటరీకు , కమిషనర్ కు వివరించగా…, జాయింట్ సెక్రెటరీ బయోగ్యాస్ ప్లాంటు లో కలియతిరిగి జరుగుతున్న వేస్ట్ ప్రాసెస్ ను , అక్కడ ఉత్పత్తి అయిన పలు ఆర్గానిక్ మెన్యూర్ లను, లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ను పరిశీలించి ప్లాంట్ నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కు సూచించారు.

అనంతరం జాయింట్ సెక్రెటరీ బయోమైనింగ్ ప్లాంట్ ను సందర్శించి ,బయో మైనింగ్ ఇప్పటివరకు ఎన్ని లక్షల టన్నులు చేశారని అడిగి తెలుసుకుని, మొత్తం 14 లక్షల టన్నుల వ్యర్ధాలలో ఆఖరు దశలో మూడు లక్షల టన్నులు నిర్వహిస్తే పూర్తవుతుందని అధికారులు తెలపగా బయో మైనింగ్ ఇంకా మెరుగైన విధంగా నిర్వహించాలన్న దానిపై ఆలోచించాలని, బయో మైనింగ్ నిర్వహణ సంతృప్తినిచ్చిందని ,బయోమైనింగ్ నిర్వహణ 2026 ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని , జీవీఎంసీ కమిషనర్ కు జాయింట్ సెక్రటరీ సూచిస్తూ… బయోగ్యాస్ ,బయోమైనింగ్ ప్లాంట్లు నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్ గోవిందరావు, సహాయక వైద్యాధికారి డాక్టర్ ఎల్ .రవి కుమార్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పి ఎస్ ఆర్ మూర్తి, శానిటరీ సూపర్వైజర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.