ఈనెల 25న ధర్నా చేయనున్నట్లు తెలిపిన ఎస్ఎంసి సభ్యులు
చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం నాగులవెల్లటూరు బి ఎస్ ఆర్ ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా బయాలజికల్ సైన్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హెచ్ ఎం, ఎమ్ ఈ ఓ,డి ఈ ఓ అధికారులకు పలు మార్లు వినతులు చేసినా చర్యలు లేకపోవడంతో తల్లిదండ్రులు, ఎస్ ఎంసి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పెద్దల సహకారంతో పాఠశాల అభివృద్ధికి సుమారు 4 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఉపాధ్యాయ నియామకం జరగకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 25న పాఠశాలను మూసివేసి ధర్నా నిర్వహించనున్నట్లు పాఠశాల హెచ్ఎం కు ఈ రోజు వినతిపత్రం అందజేశారు.


