బదిలీలపై పునరాలోచన చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల విజ్ఞప్తి.
కలువాయి మండలంలో బదిలీలపై రాష్ట్ర ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ల అసోసియేషన్ పిలుపు మేరకు అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఈఓపీఆర్‌డీ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ వల్ల పని భారం పెరిగిందని, పక్క మండలాలకు బదిలీ చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో మహేష్, గిరి బాబు, మహారాజు, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

