బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం
యాచారం: డిసెంబర్ 30
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న వేళ కళలు–కళాకారులను ప్రోత్సహించాలనే సదుదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025” కార్యక్రమాన్ని నిర్వహించింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో తెలంగాణ నలుమూలల నుంచి 536 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాచారమ మండలం మొండిగారెల్లికి చెందిన పర్శమోని శ్రీను ముదిరాజ్ పాటల పోటీలో పాల్గొని విశేష గుర్తింపు సాధించారు. డింపుల్ డ్రీమ్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ రచన, స్వరకల్పన, దర్శకత్వం వహించిన “డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ” అనే అవగాహనాత్మక గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ పాటకు తెలంగాణ ప్రముఖ చలనచిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు, ప్రముఖ గాయని మంగ్లీ, సింగర్ మోహన భోగరాజు చేతుల మీదుగా ఘనంగా సత్కారం లభించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగి, సామాజిక అంశంపై సందేశాత్మక గీతంతో గుర్తింపు సాధించిన శ్రీను ముదిరాజ్‌కు గ్రామ ప్రజలు, కళాభిమానులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్షముని శ్రీను కుటుంబ సభ్యులు.నక్క బాలరాజా సంగీత తమ కుమారులు. విజయ్ టీచర్. శ్రీనివాస్ గుప్తా. తదితరులు పాల్గొన్నారు


