Tuesday, 9 December 2025
  • Home  
  • బక్క చిక్కుతున్న విద్యార్థులు బరువెక్కిన అధికారులు..
- కామారెడ్డి

బక్క చిక్కుతున్న విద్యార్థులు బరువెక్కిన అధికారులు..

– గుడ్డు పరిమాణం ఎంత ఉంటుందో తెలియని అధికారులు – దళారులతో కుమ్మక్కై పౌష్టికాహార బిల్లులు మాయం.. కామారెడ్డి జిల్లాలో ప్రశ్నార్థకమవుతున్న గుడ్డు, పౌష్టికాహారం సరఫరా కామారెడ్డి, 10 అక్టోబర్, పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ పథకంలో పూర్తి పారదర్శకతను తీసుకు రావడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కేవలం విద్యార్థుల హాజరు డేటాను మాత్రమే యాప్‌లో నమోదు చేస్తుండగా, ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, రాగి జావ పిండి వంటి సరుకుల వివరాలను కూడా ప్రతీ రోజు విధిగా మిడ్ డే మీల్స్ యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది పేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజ నం అందుతోంది. ఇందులో 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండగా, 9, 10 తరగతు లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోం ది. ఈ నెల నుంచే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించే ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ, తాజాగా సరుకుల విషయంలోనూ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త విధానంతో అక్రమాలకు చెక్…. గతంలో ప్రతీ నెలాఖరున మాత్రమే పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను హెడ్ మాస్టర్లు లెక్కించేవారు. కొందరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు భోజనం చేయకపోయినా లేదా గుడ్డు తినకపోయినా తిన్నట్టుగా లెక్కలు రాసే అక్రమాల కు పాల్పడేవారు.తాజా అప్‌డేట్‌తో ఈ అక్రమాల కు చెక్ పడనుంది. యాప్‌లో ఎంతమంది తిన్నా రు, ఎన్ని కిలోల బియ్యం వాడారు, ఎంతమంది రాగి జావ తీసుకున్నారు, ఎంత పౌడర్ ఉపయో గించారు అనే వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేయాలి.దీని ద్వారా పాఠశాల పాయింట్ల వద్ద బియ్యం, రాగి జావ పిండి ఎంత నిల్వ ఉందనేది ఉన్నతాధికారులకు సులభంగా తెలుస్తుంది. తని ఖీలకు వెళ్లినా లెక్కలు సరిచూడాల్సిన అవసరం లేకుండానే యాప్‌లో డేటా లభ్యమవుతుంది. ఈ ట్రాకింగ్ విధానం వల్ల అక్రమాలు జరిగే అవకాశం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో నే మిడ్ డే మీల్స్ చెల్లింపులను గ్రీన్ ఛానల్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డిలో ‘మీల్స్’ కష్టాలు: పెండింగ్‌ బిల్లులు, నాణ్యత లోపం! మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మాత్రం నాణ్యతా లోపాలు, సరుకుల కొరత అంశాలు తరచూ వెలుగులోకి వస్తున్నా యి.పౌష్టికాహారంపై ప్రశ్నార్థకం: కామారెడ్డి జిల్లాలో ని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు సక్రమంగా అందించడం లేదనే ఫిర్యాదులు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదనే ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. కలుషితాహార ఘటనలు గతంలో…. కామారెడ్డి జిల్లాలోని కొన్ని గురుకులాల్లో, పాఠశా లల్లో భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థ తకు గురైన ఘటనలు, బియ్యంలో పురుగులు వచ్చిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ సంఘ టనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించిన ప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. నిర్వాహకుల సమ్మె, బిల్లుల పెండింగ్….. మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే నిర్వాహకుల కు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం, భోజనం నాణ్యతపై ప్రభావం చూపుతోం ది. ఏడు నెలల వరకు బిల్లులు, వేతనాలు పెండిం గ్‌లో ఉండడంతో, నిత్యావసర వస్తువులను అప్పు లకు తెచ్చి వంట చేయాల్సి వస్తోందని, దీంతో నాణ్యత విషయంలో రాజీ పడక తప్పడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లు లు పెండింగ్ కారణంగా గతంలో నిర్వాహకులు సమ్మెకు దిగిన సంఘటనలు జిల్లాలో చోటు చేసు కున్నాయి.మొత్తం మీద, ఒకవైపు రాష్ట్ర విద్యా శాఖ సాంకేతికతను ఉపయోగించి పథకంలో పారదర్శకత పెంచాలని చూస్తున్నా, క్షేత్ర స్థాయిలో కామారెడ్డి వంటి జిల్లాల్లో మాత్రం నిధుల కొరత, నాణ్యత లోపం వంటి కారణాల వల్ల పేద విద్యార్థు లకు అందించాల్సిన పౌష్టికాహారం లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.

– గుడ్డు పరిమాణం ఎంత ఉంటుందో తెలియని అధికారులు
– దళారులతో కుమ్మక్కై పౌష్టికాహార బిల్లులు మాయం..
కామారెడ్డి జిల్లాలో ప్రశ్నార్థకమవుతున్న గుడ్డు, పౌష్టికాహారం సరఫరా

కామారెడ్డి, 10 అక్టోబర్, పున్నమి ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ పథకంలో పూర్తి పారదర్శకతను తీసుకు రావడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కేవలం విద్యార్థుల హాజరు డేటాను మాత్రమే యాప్‌లో నమోదు చేస్తుండగా, ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, రాగి జావ పిండి వంటి సరుకుల వివరాలను కూడా ప్రతీ రోజు విధిగా మిడ్ డే మీల్స్ యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది పేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజ నం అందుతోంది. ఇందులో 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండగా, 9, 10 తరగతు లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోం ది. ఈ నెల నుంచే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించే ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ, తాజాగా సరుకుల విషయంలోనూ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

కొత్త విధానంతో అక్రమాలకు చెక్….

గతంలో ప్రతీ నెలాఖరున మాత్రమే పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను హెడ్ మాస్టర్లు లెక్కించేవారు. కొందరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు భోజనం చేయకపోయినా లేదా గుడ్డు తినకపోయినా తిన్నట్టుగా లెక్కలు రాసే అక్రమాల కు పాల్పడేవారు.తాజా అప్‌డేట్‌తో ఈ అక్రమాల కు చెక్ పడనుంది. యాప్‌లో ఎంతమంది తిన్నా రు, ఎన్ని కిలోల బియ్యం వాడారు, ఎంతమంది రాగి జావ తీసుకున్నారు, ఎంత పౌడర్ ఉపయో గించారు అనే వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేయాలి.దీని ద్వారా పాఠశాల పాయింట్ల వద్ద బియ్యం, రాగి జావ పిండి ఎంత నిల్వ ఉందనేది ఉన్నతాధికారులకు సులభంగా తెలుస్తుంది. తని ఖీలకు వెళ్లినా లెక్కలు సరిచూడాల్సిన అవసరం లేకుండానే యాప్‌లో డేటా లభ్యమవుతుంది. ఈ ట్రాకింగ్ విధానం వల్ల అక్రమాలు జరిగే అవకాశం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో నే మిడ్ డే మీల్స్ చెల్లింపులను గ్రీన్ ఛానల్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కామారెడ్డిలో ‘మీల్స్’ కష్టాలు: పెండింగ్‌ బిల్లులు, నాణ్యత లోపం!

మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మాత్రం నాణ్యతా లోపాలు, సరుకుల కొరత అంశాలు తరచూ వెలుగులోకి వస్తున్నా యి.పౌష్టికాహారంపై ప్రశ్నార్థకం: కామారెడ్డి జిల్లాలో ని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు సక్రమంగా అందించడం లేదనే ఫిర్యాదులు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదనే ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి.

కలుషితాహార ఘటనలు గతంలో….

కామారెడ్డి జిల్లాలోని కొన్ని గురుకులాల్లో, పాఠశా లల్లో భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థ తకు గురైన ఘటనలు, బియ్యంలో పురుగులు వచ్చిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ సంఘ టనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించిన ప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి.

నిర్వాహకుల సమ్మె, బిల్లుల పెండింగ్…..

మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే నిర్వాహకుల కు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం, భోజనం నాణ్యతపై ప్రభావం చూపుతోం ది. ఏడు నెలల వరకు బిల్లులు, వేతనాలు పెండిం గ్‌లో ఉండడంతో, నిత్యావసర వస్తువులను అప్పు లకు తెచ్చి వంట చేయాల్సి వస్తోందని, దీంతో నాణ్యత విషయంలో రాజీ పడక తప్పడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లు లు పెండింగ్ కారణంగా గతంలో నిర్వాహకులు సమ్మెకు దిగిన సంఘటనలు జిల్లాలో చోటు చేసు కున్నాయి.మొత్తం మీద, ఒకవైపు రాష్ట్ర విద్యా శాఖ సాంకేతికతను ఉపయోగించి పథకంలో పారదర్శకత పెంచాలని చూస్తున్నా, క్షేత్ర స్థాయిలో కామారెడ్డి వంటి జిల్లాల్లో మాత్రం నిధుల కొరత, నాణ్యత లోపం వంటి కారణాల వల్ల పేద విద్యార్థు లకు అందించాల్సిన పౌష్టికాహారం లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.