ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం ZP సెంటర్ వద్ద బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణతో పాటు ఉపేందర్ గౌడ్, అల్లిక అంజయ్య, రుద్ర ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


