ఓబులవారిపల్లె జూలై 22వ పున్నమి న్యూస్
మండల పరిధిలోని సి ఓ కంబపల్లి హరిజనవాడలో బంగారం చోరీ కేసులో దొంగలించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారం రికవరీ చేసినట్లు రాజంపేట ఏ ఎస్ పి మనోజ్ హెగ్డే తెలిపారు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న ఓరంపోటు పంచాయతీలోని కమ్మపల్లి దళితవాడ గ్రామంలో బొమ్మ ఈశ్వరమ్మ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నగలు దొంగతనానికి పాల్పడ్డారు ఈనెల 14వ తేదీన దొంగతనం జరిగింది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఈశ్వరమ్మకు సమీప బంధువులైన రామసుబ్బమ్మ రమాదేవి బంగారు దొంగ లించినట్లు గుర్తించి వారి వద్ద నుండి తొమ్మిది తులాలు బంగారు దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువచేసే బంగారు ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు ఎస్సై పి మహేష్ తదితరులు పాల్గొన్నారు


