అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరం శ్రీనివాసరావు గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ గారు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్ గారు, నాయకులు కోర్లపాటి కోటబాబు గారు, మట్టపర్తి యజ్ఞశ్రీ గారు, మట్టపర్తి హరి గారు, కుసుమ శ్రీను గారు, చప్పిడి ఆదినారాయణ గారు, గోసంగి కుమార స్వామి గారు, పితాని శెట్టి గారు, రెడ్డి ఏడుకొండలు గారు, మట్ట వెంకటేశ్వరరావు గారు, దేవరపల్లి రవీంద్ర గారు, కాండ్రేకుల దుర్గ గారు, విత్తనాల బాలరాజు గారు, మట్టపర్తి విజయ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ నాయకులు బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.


