ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా లో 5 నియోజకవర్గాలు 25 మండలాలు 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయ్. 25 మండలాల్లో సుమారుగా 500 నుండి 1000 మధ్య హోటల్ రెస్టారెంట్ లు, బిర్యానీ పాయింట్లు ఉన్నాయ్.ఉన్నోళ్లు పెద్ద పెద్ద రెస్టారెంట్ లు లేనోడు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్ లకి వెళ్తుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటీ అంటే ఏ ఒక్క చోట కూడా నాన్యమైన శుచి కరమైన ఆహరం అందిచడం లేదు. నిల్వ ఉన్న చికెన్ సార్వ లు, చికెన్ లు, ఇతర ఆహార పదార్ధాలని వినయోగ దారులకి అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మురుగు నీటి కాల్వల పక్కన బండ్లు పెట్టి ఆహార పదార్ధాలు తయారు చేసి విక్రఇస్తున్నారు. అవి తిని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. వర్షాలు మొదలై సీజనల్ రోగాలు ఒక పక్కన ఉంటే నాణ్య మైన ఆహరం అందిచకుండా ప్రజల ఆరోగ్యం తో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారస్తులు ఒక పక్క. ఇప్పటికి అయినా జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు హోటల్, రెస్టారెంట్ లు, ఆహార సంభందిత పరిశ్రమ ల మీద దాడులు చేసి నాసి రక మైన ఆహరం అందజేస్తున్న వాటిని సీజ్ చేసిన కఠిన శిక్షలు అమలు చెయ్యాలిసిన అవసరం ఎంత అయినా ఉంది అని ప్రజలు కోరుతున్నారు


