అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
ఫిలిప్పీన్స్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు సెబు ద్వీపాన్ని కేంద్రంగా చేసుకున్నాయి. భూకంప ప్రభావంతో అనేక ఇళ్లు, కార్యాలయాలు కూలిపోగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రోడ్లు పగిలిపోవడంతో రవాణా తీవ్రంగా దెబ్బతింది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడటంతో సునామీ ముప్పు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రక్షణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


