*పున్నమి Daily న్యూస్
ప్రతినిప్రతినిధి :ఖమ్మం
T.Ravinder
ఖమ్మం అక్టోబర్ 24
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరా రైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంటర్‌బోర్డు ప్రతిపాదిత షెడ్యూల్‌కు ఆమోదం తెలిపారు.
గత విద్యా సంవత్సరం మార్చి 5 నుంచి పరీక్షలు మొదలయ్యాయి. కాగా ఈ సంవత్సరం 8 రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి.పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించ నుంది. ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 26న ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొదలై, మార్చి 24తో ముగియనున్నాయి. అదే తరహాలో మన రాష్ట్రం లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ కంటే కొంత ఆలస్యంగా తెలంగాణలో పరీక్షలు ముగియనున్నాయని తెలుస్తోంది.
వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెల చివరి తేదీల్లోనే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యేవి. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా మార్చిలోకి షెడ్యూల్ మారింది. ఫిబ్రవరి నెలలో పరీక్షలు మొదలుపెడితే జేఈఈ మెయిన్, ఎప్‌సెట్, నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధ మయ్యే విద్యార్థులకు చదువుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
ఉదాహరణకు గత ఏడాది మార్చి 5న ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ తుది విడత ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైంది. దాంతో విద్యార్థులకు 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండేది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే 8 రోజుల ముందుగా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు మొత్తం కలిపి 9.50 లక్షల మందికి పైగా పరీక్షలు రాయను న్నారు.ఇదిలా ఉండగా, ఇంటర్ పరీక్షల ఫీజు పెంచాలని ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రయోగ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతో పాటు ఒకేషనల్ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు.

