అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 2 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ :
ఎలమంచిలి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నిత్యవసర సరుకులను అందించడం జరుగుతుంది. మండలంలోని ప్రతి గ్రామాన్ని ఈ స్వచ్ఛ రథం సందర్శించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమానికి ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి గారి కుమారుడు శ్రీను, కూటమి నాయకులు, పంచాయతీ సెక్రెటరీ గిరిప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది.



