*ప్రొద్దుటూరులో మొదలైన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి దీక్ష*
పున్నమి నవంబర్ 5 బుధవారం వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మునిసిపల్ ఎగ్సిబిషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ కి చెందిన గూత్తేదారుడు సుమారు 1 కోటి రూపాయలు ఎగవేసిన నేపథ్యంలో, తిరిగి ఆ డబ్బును మునిసిపల్ ఖజానాకు చెల్లించేంతవరకు దీక్షలు కొనసాగిస్తామని ఇవాళ మునిసిపల్ ఆఫీసు వద్ద రిలే నిరాహారా దీక్షలను ప్రారంభించిన వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అధికార ప్రతినిధి *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి* , ఇంకా ఆయనతో పాటు ఇవాళ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు జరిగే ఈ నిరాహార దీక్షలో రాచమల్లు తోపాటు వైయస్సార్ టి.యు.సి నియోజకవర్గ అధ్యక్షులు ఖాజాపీర్ , 9వ వార్డు కౌన్సిలర్ సత్యం నిరాహార దీక్ష చేస్తున్న వారిలో ఉన్నారు మరియు నియోజకవర్గానికి చెందిన ప్రజలు, పలువురు వై.యస్.ఆర్.సి.పి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు షాలువాలు, పూలదండలతో ఈ దీక్షకు మద్దతు తెలిపారు.


